IND vs AUS: ఆసీస్ 181 పరుగులకు ఆలౌట్...! 3 d ago
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టు వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్‌ను 181 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమ్ ఇండియాకు 4 పరుగుల ఆధిక్యం దక్కింది. అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ (57) హాఫ్ సెంచరీ సాధించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్జస్ (23), అలెక్స్ కేరీ (21) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 3, నితీశ్ 2, బుమ్రా 2 వికెట్లను పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.